సంక్రాంతి విన్న‌ర్ ఎవ‌రో తేలిపోయిందా..?
సంక్రాంతి పోటీ ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటు చిరంజీవి.. అటు బాల‌య్య‌… ఇద్ద‌రూ ఢీ అంటే ఢీ అంటూ బ‌రిలో దిగారు. గ‌త మూడు ద‌శాబ్దాలుగా నెల‌కొన్న పోటీ ఈ పొంగ‌ల్‌కి మ‌రింత వేడెక్కింది. దాదాపు ప‌దిహేనేళ్ల త‌ర్వాత మ‌రోసారి బాక్సాఫీస్ ద‌గ్గ‌రికి ఒకేసారి రావ‌డంతో ఆ వేడి బాగా క‌నిపిస్తోంది. చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150కి ఓపెనింగ్స్ రావ‌డంతో బాల‌య్య మూవీ కాస్త వెనక‌బ‌డింది. సినిమా క‌థ‌, క‌థ‌నం, కంటెంట్ ప‌రంగా రెండు వేర్వేరు జాన‌ర్స్‌. ఒక‌టి రైతు స‌మ‌స్య‌ల బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కిన చిత్రం. మ‌రొక‌టి… చారిత్ర‌క గాథ‌. అయితే, ఓపెనింగ్స్ ప‌రంగా చిరంజీవి మూవీకే క్లియ‌ర్ అడ్వాంటేజ్ క‌నిపిస్తోంది. కానీ, కంటెంట్ ప‌రంగా బాల‌య్య చిత్రానికి అడ్వాంటేజ్ క‌నిపిస్తోంది. ఓపెనింగ్స్ అయిపోయాయి. ఇక మిగిలింది లాంగ్ ర‌న్‌లో తేల్చుకోవ‌డ‌మే. రాబోయే మూడు వారాల గ్యాప్‌లో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎవ‌రు ఎక్కువ వ‌సూళ్లు చేస్తార‌నేదే ఇప్పుడు కీల‌కంగా మారింది. ప‌దేళ్ల త‌ర్వాత మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ కావ‌డంతో ఆడియెన్స్ దీనికే ఓటేస్తార‌ని చెబుతున్నారు మెగాభిమానులు. అందుకే, రికార్డ్ ఓపెనింగ్స్ ద‌క్కాయ‌ని అంటున్నారు. మ‌రోవైపు, నంద‌మూరి ఫ్యాన్స్ మాట మ‌రోలా ఉంది. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం గ‌తంలో ఎన్న‌డూ తెర‌కెక్క‌ని మూవీ అని, దీంతో, త‌మ హీరో సినిమా చూడ‌డానికే వ‌స్తార‌ని ధీమాగా చెబుతున్నారు. త‌మ సినిమాలో కావాల్సినన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్నాయ‌ని ఖైదీ నెంబ‌ర్ 150కి ఓటేశావారు చెబుతున్నారు. శాత‌కర్ణి ప్రేమికులు మాత్రం త‌మ మూవీ చారిత్ర‌క మూవీయే అయినా క్రిష్ ప‌క్కా ప్లాన్డ్‌గా బాల‌య్య బాడీ లాంగ్వేజ్‌కి త‌గ్గ‌ట్లు డిజైన్ చేశాడ‌ని, అది తొలిరోజే క‌నిపించింద‌ని అంటున్నారు. చిరంజీవి డ్యాన్స్‌లు, కామెడీ టైమింగ్ ఖైదీకి అడ్వాంటేజ్ అయితే, క‌త్తి ఫైట్‌లు, బాల‌య్య ప‌లికిన ఎమోష‌న‌ల్ డైలాగులు శాత‌క‌ర్ణికి ప్ల‌స్ అవుతాయ‌ని అంటున్నారు. ఇలా ఎవ‌రి వాద‌న‌లు వారికి ఉన్నాయి. మ‌రి, అడ్వాంటేజ్ ఎవ‌రికి, విన్న‌ర్ ఎవ‌రు అనేది తేలాలంటే మ‌రో మూడు వారాలు వెయిట్ చెయ్య‌క‌త‌ప్ప‌దు.
Rating: twostar