హృతిక్ రోష‌న్‌కి పెళ్లి కుదిరింది…. ఆవిడే పెళ్లి కూతురు…!!
హృతిక్ రోష‌న్ రెండో మ్యారేజ్‌కి సిద్ధ‌మ‌వుతున్నాడు. గ‌త మూడేళ్ల కింద‌ట ఆయ‌న భార్య నుంచి విడిపోయాడు. ఆమెకు భ‌ర‌ణం కింద దాదాపు 400 కోట్లు చెల్లించాడ‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే, ఇది అబ‌ద్ధ‌మ‌ని ఆ త‌ర‌వాత ఆయ‌న ఖండించారు. ఆ విషయం ప‌క్క‌న‌పెడితే… త‌న గాళ్‌ఫ్రెండ్‌, ప్రియురాలు సుజానే ఖాన్‌ని హృతిక్ వివాహం చేసుకున్నాడు. ఇద్ద‌రూ క‌లిసి ప‌ద‌మూడేళ్లు కాపురం చేశారు. కానీ, హృతిక్ మ‌రొక‌రితో ప్రేమాయ‌ణం న‌డుపుతున్నాడ‌నే ప్ర‌చారంతోపాటు, ఇటు సుజానేకి కూడా మ‌రో బాలీవుడ్ హీరో అర్జున్ రామ్ పాల్‌తో రిలేష‌న్ ఉందనే రూమర్‌ల‌తో ఇద్ద‌రూ విడిపోయారు. హృతిక్ రోష‌న్ కంగ‌నాని పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని కొన్నాళ్ల కింద‌ట రూమ‌ర్ కూడా నడిచింది. కానీ ఇద్ద‌రి మ‌ధ్య ఫ్రెండ్‌షిప్ చెడిపోయి.. ఒక‌రిపై ఒక‌రు కోర్టులో కేసులు వేసుకునే దాకా వెళ్లింది. మ‌రోవైపు, సుజానే కూడా మ‌రో పెళ్లి చేసుకోలేదు. మ‌రోవైపు, వీరికి ఇద్ద‌రు పిల్లలు. పిల్ల‌ల‌ని ఇద్ద‌రూ బాగా చూసుకుంటున్నారు. దీంతో, వారికోసం హృతిక్‌, సుజానే మరోసారి పెళ్లి చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ రీసెంట్‌గా కాస్త బ‌ల‌ప‌డింద‌ని, అభిప్రాయ బేధాల‌ను పెద్ద‌లు క్లియ‌ర్ చెయ్య‌డంతో మ‌న‌సులు క‌లిశాయ‌ని… ఇటీవ‌లే హృతిక్‌-సుజానే క‌లిసి ఫారిన్ టూర్‌కి కూడా వెళ్లార‌ని చెబుతున్నారు. అక్క‌డే మ‌రోసారి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యార‌ట‌. అయితే, ఈ మ్యారేజ్‌కి ఇంకా ముహూర్తం కుద‌ర‌లేద‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నమాట మాత్రం నిజం అంటున్నారు. ఇది మాత్రం మ‌రో షాకింగ్ న్యూస్‌. గ‌త కొన్నాళ్లుగా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న హృతిక్‌.. ఈ మ్యారేజ్‌తో అయినా సెట్ అవుతాడా..? అనేది చూడాలి.
Rating: fivestar