అభిమానాన్ని నెట్టేసిన బాలయ్య
అభిమానం మంచిదే..అది మితిమీరితే ఇబ్బందే..అలాగే జరిగింది బాలయ్య విషయంలో. ‘జై బాలయ్య.. జై బాలయ్య’ అని గొంతు చించుకొని అరిచే ఫ్యాన్స్ పిచ్చిపనులు ఆయనకు చిరాకు తెప్పించాయి. ‘ఓ అభిమాని బాలయ్యకు అతి సమీపానికి వచ్చి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. అతడి చేతిని బాలయ్య నెట్టేయడం.. ఫోన్ కిందపడడం’ ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇదంతా ఇప్పుడు సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై ఇప్పుడు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. నందమూరి యాంటీ ఫ్యాన్స్ ఈ వీడియోతో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. చాలామంది నెటిజన్లు కూడా బాలయ్య ఇలా చేసుండకూడదని చెబుతున్నారు. మరికొంతమందేమో అభిమానులదే తప్పన్నట్టు పోస్టులు పెడుతున్నారు. కొందరు అభిమానులు ఏమంటున్నారంటే… అభిమానిగా మనం అడిగితే.. వాళ్లు నవ్వుతూ మనకు సమయం ఇచ్చిన్నప్పుడు మాత్రమే మనం ఫొటోలు కానీ, సెల్ఫీలు కానీ తీసుకుంటే.. అభిమానులు అని చెప్పుకోవడానికి మనకు.. హీరోలమని చెప్పుకోవడానికి వాళ్లకు గర్వంగా ఉంటుందని చెబుతూ.. ఎవరికి అసహనం కలిగినా.. అభ్యంతరం కలిగినా.. ఇద్దరికీ మంచిది కాదని చెబుతున్నారు. అయితే అదే థియేటర్ వద్ద.. ఈ ఘటన జరిగినప్పుడు ఉన్న పలువురు అభిమానులు ‘థియేటర్‌ లోపల ఓ అమ్మాయి అడిగితే కాదనకుండా లేచి, నిలబడి మరీ ఫొటోలకు ఫోజులిచ్చిన బాలయ్య.. థియేటర్ బయట ఓ అబ్బాయి సెల్ఫీ తీసుకుంటుండగా ఇలా చేయడమేంటి’ అని అడుగుతున్నారు. ‘నటసార్వభౌమ నందమూరి తారకరాముడి కుమారుడిగా నటనలోనూ, రాజకీయంగానూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణ.. అభిమానులతో ఇలా ప్రవర్తించకుండా ఉండాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. లేదంటే అక్కడ క్రౌడ్ అంతా క్లియర్ చేశాక బాలయ్య బయటకు వచ్చుంటే ఇలా జరిగే అవకాశం ఉండేదికాదేమో’ అని బాలయ్య అభిమానులు అంటున్నారు.
Rating: onestar