ఆమెకు ఎక్స్‌పోజింగ్‌ పెద్ద మేటరే కాదట!
ఓ పెద్ద స్టార్‌ కూతురైనా సాధారణ కమర్షియల్‌ హీరోయిన్‌లా గ్లామరస్‌గానే స్ర్కీన్‌ మీద కనబడుతుంటుంది కమల్‌ డాటర్‌ శృతీహాసన్‌. ఆమెకు ఇండివిడ్యువాలిటీ కొంచెం ఎక్కువే. మొదటి సినిమాలోనే బికినీ వేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘ఎవడు’ సినిమాలోని ఓ సాంగ్‌లో కొంచె ఓవర్‌ ఎక్స్‌పోజింగ్‌ చేసింది శృతి. ఆ ఫోటోలు కాస్తా నెట్‌లో దర్శనమివ్వడంతో శృతి ఫీలయ్యింది. ఆ ఒక్క సందర్భంలో మాత్రమే శృతి తన ఎక్స్‌పోజింగ్‌ గురించి బాధపడింది. తాజాగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఎక్స్‌పోజింగ్‌ గురించి అడిగిన రిపోర్టర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిందట. ‘గ్లామర్‌ ఇండసీ్ట్రలో మడి కట్టుకుని కూర్చుంటే లాభం లేదు. అయినా నాకు సంబంధించినంత వరకు ఎక్స్‌పోజింగ్‌ అనేది అసలు మేటరే కాదు’ అని చెప్పి అక్కణ్నుంచి వెళ్లిపోయిందట.
Rating: fivestar