అయ్యో పాపం.. అమలాపాల్‌పై నిషేధం?
ఇటీవల కొద్దికాలంగా విడాకుల వ్యవహారంతో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన అమలాపాల్‌పై కోలీవుడ్‌లో నిషేధం కొనసాగుతున్నట్లు సమాచారం. విడాకుల వ్యవహారంలో కోర్టు మెట్లు ఎక్కిన అమలాపాల్‌కు కోలీవుడ్‌లో నిర్మాతలెవరూ అవకాశాలు ఇవ్వడం లేదట. దీనంతటికీ కారణం.. అమలా భర్త ఏఎల్ విజయ్ తండ్రి అళగప్పన్. స్వయంగా నిర్మాత అయిన అళగప్పన్‌.. అమలాపాల్‌కు అవకాశాలు ఇవ్వొద్దని తమిళ నిర్మాతలకు సూచించాడని మాట్లాడుకుంటున్నారు. అళగప్పన్‌కు తమిళ ఇండస్ట్రీలో పలువురు పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమలాకు అవకాశాలు ఇస్తే.. అళగప్పన్‌తో తమ సంబంధాలు ఎక్కడ దెబ్బతింటాయోనని పలువురు నిర్మాతలు భావిస్తున్నట్లు కోలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా, విడాకుల వ్యవహారానికి ముందు అమలాతో సినిమాలు చేయాలనుకున్న కొందరు నిర్మాతలు ఇప్పుడు దాని గురించి మాట్లాడడంలేదని చెప్పుకుంటున్నారు. అంటే అమలాపాల్‌పై కోలీవుడ్ అధికారికంగా నిషేధం విధించకపోయినా.. అళగప్పన్ కనుసన్నల్లో అనధికారికంగా నిషేధం కొనసాగుతున్నట్లే. పాపం.. అమలాపాల్ ఏం చేస్తుందో?
Rating: fivestar