ప్రగ్యతో మెగాహీరో పెళ్లి?
కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రగ్య జైస్వాల్! వరుసగా మూడు విజయాలు, తాజా ‘తిక్క’ ఫ్లాప్‌లో ఉన్నాడు మెగాహీరో సాయిధరమ్‌తేజ్! ఇప్పుడు వీళ్లిద్దరూ దంపతులు కాబోతున్నారు. కానీ, నిజంగా కాదులెండి.. సినిమాలో! ఇద్దరూ భార్యభర్తలుగా ఓ సినిమాలో నటించబోతున్నారు. ఆ సినిమా సందీప్ కిషన్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నక్షత్రం’. ఓ పవర్‌ఫుల్ పోలీస్ కథాంశాన్ని తెరపైన చూపించబోతున్న కృష్ణవంశీ.. అందులో ఈ మెగా వారసుడికీ ఓ చిన్న పాత్రను ఇచ్చాడట. ఆ పాత్రను చేసేందుకు సాయిధరమ్‌తేజ్ కూడా అంగీకరించాడట. పాత్ర చిన్నదే అయినా.. ఆ పాత్ర కూడా చాలా శక్తిమంతమైనదంటున్నారు. సాయిధరమ్‌కు జంటగా ప్రగ్యను సెలెక్ట్ చేశారు. సినిమాలో సాయికి ప్రగ్య భార్యగా కనిపించనుంది.
Rating: fivestar