నటించాలంటే పడక సుఖం ఇవ్వమన్న హీరో, దర్శకుడు
సి'నీ'మా బయటనుంచి చూసేవారికి .. అందమైన లోకం... ఆ లోకంలోకి అడుగుపెట్టి.. అందరిలోకి స్పెషల్ గా కనిపించాలని.. తమ ప్రతిభతో అంబరాన్ని అందుకోవాలని కోరుకొంటారు. చిత్ర పరిశ్రమ అంటే రంగుల రంగుల ప్రపంచం లా పైకి కనిపిస్తుంది.. కానీ లోపల తరచి చూస్తే.. ఎన్నెన్నో వ్యధలు.. కథలు.. సినిమాల మీద మోజుతో పాకుడురాళ్ళ మీద అడుగు పెట్టి.. జారి పడిన జీవితాలెన్నో.. మేడిపండు చందమైన పరిశ్రమలోని ఆడవారి జీవితాల కన్నీళ్లను.. కష్టాలను.. సినిమాల్లో రాణించాలని తమ ఆత్మాభిమానాన్ని, శరీరాన్ని తాకట్టుపెట్టే.. వరకూ.. అవకాశాలు ఇవ్వని సినీ పెద్దల గురించి బాలీవుడ్ నటి లోకానికి తెలియజేసింది. బాలీవుడ్ నటి టిస్కా చోప్రా నటిగా అవకాశాల కోసం వెదుకుతున్న సమయంలో ఒక ప్రముఖ హీరో తనతో గడిపితే సినిమాల్లో అవకాశం ఇస్తానని ప్రపోజల్ పెట్టాడు.. అదీ ఒకటి రెండు రోజులకు కాదు.. మూడు నెలలు పడక సుఖం ఇవ్వాలని.. అందుకు ప్రతిగా తాను టిస్కా కి నటించే అవకాశం ఇప్పిస్తానని షరతు పెట్టాడట... అయితే ఇలాంటి ప్రపోజల్స్ పెట్టింది ఒక్క హీరో మాత్రమే కాదు.. దర్శకుడు కూడా అని అప్పటి రోజుల్లో చోటు చేసుకొన్న సంగతులను గుర్తుచేసుకొన్నది. కానీ తను అవకాశాల కోసం ఎవరికీ లొంగలేదని.. చాలా కష్టపడి చిన్న చిన్న పాత్రలతో నటించే అవకాశం దక్కించుకొన్నానని తెలిపింది. ముఖ్యంగా ఇటువంటి ప్రపోజల్స్ పెట్టేది బీ... గ్రేడ్ హీరోయిన్లకు అని.. కాగా కొంత మంది మాత్రం ఇటువంటి ఆఫర్లతో ఆడవారిని మోసం చేస్తారని.. కూడా తెలిపింది. అటువంటి వారికి తగిన బుద్ధి చెప్పాలంది. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో పడక సుఖం కోసం ఎదురు చూసే వారు ఎక్కువగా ఉన్నారని చెప్పింది.. టిస్కా చోప్రా తెలుగులో మల్లెపువ్వు, బ్రూస్ లీ వంటి సినిమాల్లో నటించింది..
Rating: fivestar